ఆదిలాబాద్ టౌన్, వెలుగు : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో, ఇటు రాష్ర్టంలో అధికారంలోకి రానుందని ఆదిలాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన ఆదిలాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భార్గవ్ దేశ్ పాండే, అంబకంటి అశోక్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.