
ఆదిలాబాద్, వెలుగు: ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను ఆదిలాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని డైట్ మైదానంలో కొందరు యువకులు ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సోమవారం రాత్రి పోలీసులు అక్కడికి చేరుకొని పట్టణానికి చెందిన షేక్ సాజిద్, కచ్ కంటి గ్రామానికి చెందిన జోగు సాయికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వారు ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించారు. యువత, విద్యార్థులు బెట్టింగ్‌లకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకోవద్దని, అప్పులపాలపై ప్రాణా లకు మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. డీఏస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్ యాప్ లతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ డీవీ శ్రీనివాస రావు
ఆసిఫాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంగళవారం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవ చ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకోవద్దన్నారు. బెట్టింగ్‌కు పాల్పడేవారిపై పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు.