ఆదిలాబాద్​లో 6.6..ఆసిఫాబాద్​లో 6.7 డిగ్రీలు..నేటి నుంచి చలి కాస్త తగ్గే అవకాశం

ఆదిలాబాద్​లో 6.6..ఆసిఫాబాద్​లో 6.7 డిగ్రీలు..నేటి నుంచి చలి కాస్త తగ్గే అవకాశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరిగింది. ఏజెన్సీ ఏరియాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉన్నది. ఆదిలాబాద్​ జిల్లాలోని బేలలో 6.6 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​లో 6.7 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిర్మల్​ (పెంబి)లో 9.3, కామారెడ్డి (జుక్కల్​)లో 9.4, సంగారెడ్డి జిల్లా (న్యాల్కల్​)లో 9.8 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి.

జగిత్యాల జిల్లాలో 10.3, రాజన్న సిరిసిల్లలో 10.6, నిజామాబాద్​లో 10.6, పెద్దపల్లిలో 10.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 20 జిల్లాల్లో 11.4 నుంచి 14.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఆదివారం నుంచి రాత్రి టెంపరేచర్లు కాస్త తగ్గి చలి కూడా తగ్గే అవకాశం ఉంటుందని, అయితే, పొగమంచు ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.