ఆదిలాబాద్ రిమ్స్​లో గ్యాస్ట్రాలజీ సేవలు ప్రారంభం

ఆదిలాబాద్ రిమ్స్​లో గ్యాస్ట్రాలజీ సేవలు ప్రారంభం

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్​సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆదివారం గ్యాస్ట్రాలజీ ఓపీ సేవలను ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన ఆదిలాబాద్​ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ ​స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారన్నారు. కార్పొరేట్​ఆస్పత్రులతో పోటీగా ఇక్కడ సర్జరీలు జరుగుతున్నాయని తెలిపారు.

 ప్రజలు గతంలో మాదిరిగా హైదరాబాద్, ఇతర  దూర ప్రాంతాలకు వెళ్లే భారం తప్పిందన్నారు. ప్రజలు ఈ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి డైరెక్టర్​ జైసింగ్​ రాథోడ్, సూపరింటెండెంట్​అశోక్, డాక్టర్లు,సిబ్బంది పాల్గొన్నారు.