సాయిబాబా ఆలయంలో దొంగతనం

ఆదిలాబాద్ శాంతి నగర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం జరిగింది. ఇద్దరు యువకులు ఆలయ హుండీ తెరిచి నగదు చోరీ చేశారు. దొంగతనం విజువల్స్ ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  5 నెలల నుండి ఆలయ హుండీ లెక్కింపు జరగలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.