తండ్రి చనిపోయిన బాధతోనే టెన్త్‌‌ ఎగ్జామ్‌‌కు స్టూడెంట్‌‌

తండ్రి చనిపోయిన బాధతోనే టెన్త్‌‌ ఎగ్జామ్‌‌కు స్టూడెంట్‌‌

అమ్రాబాద్, వెలుగు : తండ్రి చనిపోయిన బాధలోనే టెన్త్‌‌ ఎగ్జామ్‌‌కు హాజరయ్యాడు ఓ స్టూడెంట్‌‌. వివరాల్లోకి వెళ్తే... నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా అమ్రాబాద్‌‌ మండలం మన్ననూర్‌‌ గ్రామానికి చెందిన విస్లావత్‌‌ లఖ్య కొడుకు హేమంత్‌‌ స్థానికంగా టెన్త్‌‌ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లఖ్య గురువారం సాయంత్రం చనిపోయాడు. 

ఆ బాధతోనే హేమంత్‌‌ శుక్రవారం మన్ననూరులోని గర్ల్స్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లోని సెంటర్‌‌కు వచ్చి ఎగ్జామ్‌‌ రాశాడు. ఎగ్జామ్‌‌ పూర్తైన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.