గిరిజన భాషాభివృద్ధికి టీచర్ కృషి భేష్

గిరిజన భాషాభివృద్ధికి టీచర్ కృషి భేష్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : గిరిజన భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ స్కూల్​ టీచర్ తొడసం కైలాస్​ను కలెక్టర్​ రాజర్షి షా అభినందించారు. కైలాస్​​దంపతులను బుధవారం కలెక్టర్​ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్​ సన్మానించి జ్ఞాపిక అందజేశారు.

గోండు, కోలాం భాషల అభివృద్ధికి ఏఐ(కృత్రిమ మేధా) ద్వారా కైలాస్​​చేపడుతున్న కార్యక్రమాలను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్​కీ బాత్​ కార్యక్రమంలో కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​పై కైలాస్​ రాసిన పాటను కలెక్టర్​ చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో డీఈశో టి.ప్రణీత, టీచర్లు అజయ్,  రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.