
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లను పరిశీలించారు. వినాయక, అబ్దుల్లా, గాంధీ, అంబేడ్కర్, శివాజీ చౌక్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, పట్టణ సీఐ సునీల్తదితరుల పాల్గొన్నారు.