Adipurush trailer review:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈసారి రాఘవ రామునిగా బాక్సాఫీస్ కుంభస్థలానికిప్రభాస్ గురి పెట్టారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మర్యాదా పురుషోత్తముడు అయిన రాముడు, మర్యాదకు విరుద్ధమైన పని ఏది చేయడని, కనుసైగ చేస్తే పోరాటం చేసే సైన్యం ఉన్నప్పటికీ.. సీతాదేవి ప్రాణం కంటే మర్యాదకు ఎక్కువ విలువ ఇచ్చారని 'ఆదిపురుష్' ట్రైలర్ లో చెప్పుకొచ్చాడు దర్శకుడు ఓం రౌత్ చెప్పారు.
ఇక ట్రైలర్ లో ఒక్కో షాట్, ఒక్కో విజువల్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రాముడు, సీత, లక్ష్మణుడు,హనుమంతుడు, రావణాసురడు.. ఇలా ప్రతీ పాత్ర క్రియేషన్ చాలా బాగుంది. అంతేకాదు.. టీజర్ రిలీజ్ అప్పుడు వినిపించిన కామెంట్స్ మళ్ళీ వినిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు యూనిట్. ఇక VFX విషయంలో కూడా చాలా కేర్ తెసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే.. మూవీలో కళ్ళు చెదిరే విజువల్స్ ఉండనున్నాయని అర్థమవుతోంది. 3Dలో ఈ షాట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం ఖాయం.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. రాఘవుడిగా ప్రభాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంది. రాముడి పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక మరో ముఖ్యమైన పాత్ర సీత. ఆ పాత్రలో కృతి కూడా పేరెక్ట్ యాప్ట్ అనిపించింది. రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ కూడా నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తంగా సినిమాలో చేసిన ప్రతీ యాక్టర్ కి ఈ సినిమా ఓ ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోవడం ఖాయం. ట్రైలర్ లో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.. 'రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనుస్సు విరిచాడు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి' అని సీతా దేవి చెప్పిన డైలాగ్, 'నా కోసం పోరాడకు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అహకారం రొమ్ము చీల్చి... ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అని శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్ వింటుంటే.. గూస్ బంప్స్ రావడం పక్క.
ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రమ్ తగ్గకుండా సినిమా ఉంటుందని యూనిట్ ధీమాగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా మిగిలిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపోయిస్తున్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.