
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంత కాలంగా రేలషన్ షిప్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆ రేలషన్ ని ముందుకు తీసుకెళ్తూ.. ఇటీవలే అధికారికంగా నిశ్చితార్ధం చేసుకున్నారు ఈ జంట. కేవలం ఇరు కుటుంబసభ్యుల మధ్య చాలా రహస్యంగా జరిగింది ఏవీరి ఎంగేజ్మెంట్. ఇదే విషయాన్ని ఇద్దరు తమ తమ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్, నెటిజన్స్ తో పంచుకున్నారు.
ఇక అప్పటినుండి.. త్వరలోనే వీరి పెళ్లి కూడా ఉండనుందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, అలాంటి అప్డేట్స్ ఎం ఇవ్వకుండా ఇద్దరు తమ తమ కెరీర్లపై దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే.. తాజాగా వీరు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం సిద్దార్థ్, అదితిల పెళ్లికి రానున్న డిసెంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేశారట పెద్దలు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సిద్దార్థ్ ఇండియన్ 2 సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లోకనాయడుకు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా హిట్టు కోసం చూస్తున్న సిద్దార్థ్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.