
తెలుగు, తమిళ స్టార్ సిద్ధార్ద్ (Siddarth), హీరోయిన్ అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అదితి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా..ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. దీంతో సిద్ధార్థ్ తో ప్రేమ,పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అదితి రావ్ హైదరి.
మా కుటుంబానికి వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది. మా నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక మేమిద్దరం అనౌన్స్ చేస్తాం అని అన్నారు.
Also Read :- తెలంగాణ ప్రభుత్వానికి సమంత విన్నపం
అనంతరం ప్రేమ కాస్తా..పెళ్లిగా ఎలా మారిందో చెబుతూ..'మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది. మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకునేదాన్ని. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్నతనంలో ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. కొన్నేళ్ల క్రితం మా నానమ్మ కన్నుమూశారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు. ఓ రోజు సిద్దార్థ్ నన్ను ఆ స్కూల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. సిద్దార్థ్ ప్రపోజ్ చేసిన తీరు ఎంతో నచ్చింది. నాన్నమ్మ ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశాడు’ అని అదితిరావు హైదరీ చెప్పారు. అతను ప్రేమను వ్యక్తపరిచిన తీరు తనకెంతో ఇష్టం అన్నారు.
ఇకపోతే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో అదితి తెలుగు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.