
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ (ఏబీఆర్‌ఈఎల్) ఉత్తరాఖండ్‌లోని తన పల్ప్ అండ్ పేపర్ ప్లాంట్‌ను ఐటీసీకి రూ. 3,498 కోట్లకు విక్రయించాలని నిర్ణయించింది. తన సబ్సిడరీ సెంచరీ పల్ప్ అండ్ పేపర్‌ను అమ్మేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ ప్రకటించింది. పూర్తిగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌పై ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది.
ఈ డీల్‌కు జేఎం ఫైనాన్షియల్ ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా, ఏజెడ్‌బీ అండ్ పార్ట్‌నర్స్ న్యాయ సలహాదారుగా పనిచేస్తాయి. ఏబీఆర్‌ఈఎల్ పేపర్ బిజినెస్‌ను కొనడం ద్వారా మరింత విస్తరించడానికి ఐటీసీకి వీలుంటుంది. ప్రస్తుతం ఐటీసీ నాలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 10 లక్షల టన్నుల కంటే ఎక్కువ కాగితాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ తాజాగా పెయింట్స్, జ్యువెలరీ రిటైలింగ్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలోకి విస్తరించింది.