రాబోయే ఐదేళ్లు కష్టమే జేబులో పైస లేక పరేశాన్

  • ఏఐ వలన జాబ్ పోతుందనే భయం
  • లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల వైపు మొగ్గు
  • ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వే

న్యూఢిల్లీ: భవిష్యత్​లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చాలా మంది భయపడుతున్నారు. రాబోయే ఐదేళ్లు కష్టమేనని, ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని   88 శాతం మంది ప్రజలు వెల్లడించారు. తమను తాము రక్షించుకోవడానికి  వివిధ చర్యలు తీసుకుంటున్నారని ఆదిత్య బిర్లా సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  సర్వే పేర్కొంది. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోతుందనే భయంలో 35 శాతం మంది ఉన్నారంది. 

ఈ సర్వేలో మొత్తం 7,978 మంది  పాల్గొన్నారు. దీని ప్రకారం, కొత్త  టెక్నాలజీల వలన ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వలన తమ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోతామని 33.95 శాతం  మంది భయపడుతున్నారు. ఆర్థిక అనిశ్చి పరిస్థితులు ఎదుర్కొనేందుకు  ఇన్సూరెన్స్ బాట పడుతున్నారు. 76.57 శాతం మంది రెస్పాండెంట్లు తాము ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 70 శాతం మంది సేవింగ్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెయింటైన్ చేస్తున్నారు. 49 శాతం మంది ఫిక్స్​డ్​ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేశారు.  

తాము ఎటువంటి పైనాన్షియల్ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని 34.87 శాతం మంది చెప్పారు. కానీ, ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకున్నామని పేర్కొన్నారు.  ‘ఆర్థిక పరిస్థితులపై ప్రజలకున్న వివిధ ఆందోళలను నిశ్చిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2024 తెలియజేస్తోంది. రాబోయే ఐదేళ్లలో  ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని  88 శాతం మంది ఆందోళనపడుతున్నారు. చాలా మంది ఒత్తిడిలో ఉన్నారనే విషయం తెలుస్తోంది’ అని ఆదిత్య బిర్లా సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఎండీ కమలేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. 

ఉన్నత చదువులకు ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఉన్నత చదువులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసర మని ప్రజలు భావిస్తున్నారు. ఎడ్యుకేషన్ కాస్ట్ పెరగ డంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలని 39.69 శాతం మంది మహిళలు, 45.22 %  మంది మగవారు భావిస్తున్నారు. పిల్లల చదువుల కోసం ఫండ్స్ రెడీగా ఉంచుకోవాలని 42.24 శాతం మంది మహిళలు, 38.13 & మంది మగవారు పేర్కొన్నారు.

సర్వేలోని ముఖ్యమైన పాయింట్లు..

  • 1. ఫైనాన్షియల్ ప్లానింగ్ కీలకమని 

  • 83 శాతం మంది భావిస్తున్నారు.

  • 2. బ్యాంక్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు వంటి సేఫ్టీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు  77 శాతం మంది చూస్తున్నారు.

  • 3. 40 శాతం మంది మాత్రం రిస్క్ ఎక్కువున్నా రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువిచ్చే అసెట్లపై ఆసక్తి చూపించారు.

  • 4. 72 శాతం మంది గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ వంటి ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తామన్నారు.

  • 5. ఫైనాన్షియల్ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్  చేస్తామని 68 % మంది పేర్కొన్నారు.

  • 6. షార్ట్ టెర్మ్ లాభాల కంటే లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 70 శాతం మంది మొగ్గు చూపారు.

  • 7. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ల రికమండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో అయ్యామని 73 శాతం మంది తెలిపారు.