ఆదిత్య ఎల్ 1 మిషన్ ఫుల్ సక్సెస్ అయింది. చరిత్రలో ఇస్రో మరో మైలురాయి దాటింది.శనివారం ( జనవరి 6) తన గమ్యస్థానమైన లెగ్రాంజ్ 1 ను ఆదిత్య ఎల్ 1 చేరుకుంది. సూర్యునిపై అధ్యయనం కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్ 1 వ్యోమనౌక గమ్యస్థానం చేరుకుంది. 1.5 మిలియన్ లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమనౌక లెగ్రాంజ్ 1 స్థానానికి చేరుకుంది. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం సేవలందించనుంది.
2023 సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ను PSLV-C57 రాకెట్ లో సూర్యుడి అధ్యయనానికి ఇస్రో ప్రయోగించింది. సూర్యుడి బయటి పొర అయిన కరోనాతో సహ పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగించబడింది. సుదీర్ఘ 1.5 కిలోమీటర్ల సుదర్ఘ ప్రయాణం తర్వాత గమ్యస్థానం అయిన లెగ్రాంజ్ పాయింట్ 1 ను ఆదిత్య L1 జనవరి 6 సాయంత్రం 4.30కి చేరుకుంది.
లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 ఉంచిబడినప్పుడు అది భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఒక శాతం అంటే 1.5 మిలియన్ కిలోమీటర్ల వద్ద ఉండి అధ్యయనం కొనసాగుతంది. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాతో సహా సూర్యుని బయటి పొరల లోతైన అధ్యయనం చేయనుంది.
భూమికి, సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ సమతుల్యం ఉన్న ప్రాంతం లాగ్రాంజ్ పాయింట్ 1 నిరంతర అధ్యయనం కోసం స్థిరమైన స్థానాన్ని అందిస్తుంది. ఆదిత్య ఎల్ 1 5.2 సంవత్సరాల పాటు లాగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యిని అధ్యయనం చేస్తుంది. తర్వాత దీనికి పొడిగించే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.