రాహుల్ గాంధీతో ఆదిత్య థాక్రే భేటీ

రాహుల్ గాంధీతో ఆదిత్య థాక్రే భేటీ

న్యూఢిల్లీ: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండేను సన్మానించిన తర్వాత ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఏవీఏ)లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాక్రే.. బుధవారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ఆరోపణలపై ఈ ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. 

కాగా, గత వారం ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ను కూడా ఆదిత్య థాక్రే కలవనున్నట్టు తెలిసింది. 2022లో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చేందుకు అప్పటి అవిభక్త శివసేన శాసనసభ్యులలో ఎక్కువ మందితో కలిసి ఏక్​నాథ్ ​షిండే.. బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ మద్దతుతో ఆయన సీఎం అయ్యారు. 

తరువాత శివసేనపై నియంత్రణ సాధించాడు. కాగా, ఇటీవల శరద్​ ​పవార్.. షిండేకు మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కార్‌‌‌‌‌‌‌‌ను ప్రదానం చేసి సన్మానించారు. దీంతో మహారాష్ట్ర ప్రతిపక్ష ఏవీఏ గందరగోళంలో పడింది. కాగా, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం.. షిండేను దేశద్రోహిగా అభివర్ణించింది.