పోడు పట్టాల పంపిణీలో అన్యాయం చేసిన్రు.. మంత్రిని కలిసిన నల్లమల చెంచులు

పోడు పట్టాల పంపిణీలో అన్యాయం చేసిన్రు..  మంత్రిని కలిసిన నల్లమల చెంచులు

అమ్రాబాద్, వెలుగు: పోడు హక్కుపత్రాల మంజూరులో తమకు అన్యాయం చేశారని ఆదివాసీ చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్ననూర్  ఐటీడీఏ పరిధిలోని బౌరాపూర్, కొల్లం, కొమ్మనపెంట, పుల్లాయిపల్లి, మద్దిమడుగు, ఉప్పునుంతల (బీకే) గ్రామాలకు చెందిన 60 మంది చెంచులు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ALSO READ :ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్​ పెట్టాలె

 తరతరాల నుంచి భూమి సాగు చేస్తున్నామని, తమకు హక్కుపత్రాలు అందలేదని వాపోయారు. మంత్రి స్పందిస్తూ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్  గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, రాష్ట్ర నాయకులు జాబిలి, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కా బాలయ్య, ప్రజా ఫ్రంట్  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.