- జిల్లా అటవీ కార్యాలయం ముందు ఆదివాసీల ధర్నా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : తునికాకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ ను కూలీలకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బోనస్ చెల్లించారని, కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చెల్లింపులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.