
- సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు
ముషీరాబాద్, వెలుగు: అత్యంత నిరుపేదలైన ఆదివాసీ ఎరుకలను ఎస్టీ– ఎ గ్రూపులో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని సంఘం ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆదివాసీ ఎరుకలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఎస్టీ– ఎ గ్రూపులో చేర్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీలోనూ ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.