
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన కులస్తుల ఆరాధ్య దైవం హీరా సుక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పట్టణంలోని బస్టాండ్ హీరా సుక్కా దేవుడికి కులస్థులు డోలు వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించారు.
అనంతరం జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి రాంలీలా మైదానంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆదివాసీ ప్రదాన్ సమాజ్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గంగాదేవి, నాయకులు మేస్రం శంకర్, రాం కిషన్, ఉయిక సుదర్శన్, ఆత్రం అనుసూయ తదితరులు పాల్గొన్నారు