
బజార్హత్నూర్, వెలుగు: మండలంలోని దేగామలో కొలువైన పోచమ్మ ఆలయానికి మంగళవారం ఆదివాసీలు పోటెత్తారు. సంప్రదాయాల డప్పు, డోలు వాయిద్యాలతో ఎడ్ల బండ్లతో, కాలి నడకన దర్శనానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి బోనాల సమర్పించారు.
కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో పోచమ్మ ఆలయం కిటకిటలాడింది.