కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలివ్వకపోతే ఆదివాసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఆదివాసీ గిరిజనులను కించపరిచే విధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆర్హులైన ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలిస్తామని సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని ఆదివాసులపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ మరో నిజాం రజాకార్లా వ్యవహరిస్తూ అడవి బిడ్డలైన ఆదివాసులపై విషం గక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్ల కేసీఆర్ కు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. 5,6 షెడ్యూల్ పై కేసీఆర్ కు అవగాహన లేదని.. 5, 6 షెడ్యూల్ ప్రకారం అడవిపై పూర్తి అధికారాలు ఆదివాసులకే ఉంటాయన్నారు. అదివాసులపై అటవీ, పోలీసు అధికారుల అణచివేతను ఇక సహించబోమని బాపూరావు స్పష్టం చేశారు.
ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్‌పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు
- తెలంగాణం
- February 10, 2023
లేటెస్ట్
- క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
- చిగురుమామిడికి గౌరవెల్లి నీళ్లు
- ఎవర్రా మీరు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు.. గ్యాస్ రిపేరింగ్ ముసుగులో..
- మెట్రో గ్రీన్‌చానెల్ ద్వారా గుండె తరలింపు
- లెక్కలు తేలుతున్నాయి.. రైతు భరోసా సర్వేలో సాగు చేయని భూముల లెక్కలు రికార్డు
- తాగునీటి తిప్పలకు చెక్.. అమృత్ స్కీం కింద 3 మున్సిపాలిటీలకు రూ.51 కోట్లు మంజూరు
- బేస్ క్యాంప్ తరహా ఫారెస్టు.. స్టేషన్లు కూనవరం, గొందిగూడెంలో ఏర్పాటు
- ఇంటర్ ఫిజిక్స్‌లో ఏఐ.. వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి తెచ్చే యోచనలో ఇంటర్ బోర్డు
- బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జల దోపిడీ: మంత్రి ఉత్తమ్
- అప్పు పైసలు అడిగినందుకు గొంతు కోసిండు!
Most Read News
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్‌లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- తెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- హైదరాబాద్‌లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఒకేరోజు ఇంత పెరిగితే కష్టమే..!
- Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?