'మేజర్' హీరో అడవి శేషు ఇంటర్వ్యూ

'మేజర్'  హీరో అడవి శేషు ఇంటర్వ్యూ

26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ అధికారి మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌. టాలెంటెడ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కించిన మూవీలో సందీప్  పాత్రలో అడవి శేషు నటించారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభించింది. బాక్సాఫీజును బద్దకొట్టి..బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  భారతీయ సినిమా చరిత్రలో మేజర్ చిత్రం ఒక మైలురాయి అంటూ సినీ విశ్లేకులు కితాబిచ్చారు.  మేజర్ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు.. హీరో అడవి శేషు మనతో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

మూవీ సక్సెస్ అయింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
 ఆనందంగా ఉంది.  మేజర్ సందీప్ స్టోరీని..ఆయన జీవితాన్ని జనాల్లోకి ఇంకా తీసుకెళ్లాలని తపన.

గత సినిమాల విజయాలకు..ఈ సినిమా విజయానికి డిఫ్రెంట్ ఏమైనా అనిపిస్తుందా ?
మోటివేషన్.  గూడచారి సినిమా తీసినప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాలని తీశాం. మేజర్ సినిమా తీసేటప్పుడు  మేజర్ సందీప్ స్టోరీ ప్రతీ మనసుకు రీచ్ అవ్వాలని చేశాం. అంతిమంగా లక్ష్యం వేరు. అది రీచ్ అయ్యామని అనుకుంటున్నాం.

మూడేళ్ల కష్టం మేజర్ సినిమా. మరి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లేనా..?
మేజర్ సినిమా కాదు. ఒక ఎమోషన్. అయితే ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే  డబ్బుల్లేక. ఇతర కారణాల వల్ల కొందరికి కుదురదు.  వారికి సాయం చేయాలని అనుకుంటున్నాం.  మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరిట ఫండ్ సెట్ చేసి..వారికి సాయం చేయాలని భావిస్తున్నాం. 

మేజర్ సినిమాపై అంత ఎఫెక్షన్ ఉండానికి ప్రధాన కారణం ఏంటి?
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణనే. ఆయన జీవితాన్ని చూసిన విధానం. సినిమాకు జాన్ దూంగా దేశ్ నహి అని ట్యాగ్ బాగుందని పెట్టలేదు. ప్రాణమైనా పెడతాను కానీ దేశాన్ని ఇవ్వనన్న మనిషి..  6వ తరగతిలోనూ అలాగే ఉన్నాడు. పెళ్లయినప్పుడు అలాగే ఉన్నాడు. ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కూడా అంతే. అలా అని ఆయన డీప్గా మాట్లాడతాడని కాదు.. గుండెలో ఎప్పుటికీ అలా ఉండేది. లైఫ్లో ప్రతీదాన్ని అలా  చూసే మనిషిని.. వందల ప్రాణాలను కాపాడి మరి చేసిన సాహసానికి కొంచెమైనా చేయాలని అనిపించి ఈ సినిమా తీశాం.

మేజర్ సినిమా పోస్టర్ చూస్తే..ప్రతీ ఒక్కరు అనుకుంటారు. ఇందులో దేశభక్తి మాత్రమే ఉందనుకుంటారు. కానీ సినిమాలో కామెడీ, రొమాన్స్ అన్నీ ఉన్నాయి.
మేము మేజర్ సందీప్ జీవితాన్ని సినిమాగా తీశాం. ఆయన ఎలాంటివాడో అలాగే సినిమాలో చూపించాం. ఆయన తన జీవితంలో ఎలా ఉన్నాడో అలాగే చూపించాం. ఆయనది ఫేమస్ పాస్ పోర్టుఫోటో ఉంటుంది కదా. అందులో చిన్న చిరునవ్వు ఉంటుంది. అయితే ఆ సమయంలో ఫోటో గ్రాఫర్ ఫోటో తీస్తున్నప్పుడు  ఒక్కసారిగా నవ్వాడు. ఫోటో గ్రాఫర్ నవ్వొద్దు అన్నా..చివరకు నవ్వు ఆపుకోలేక నవ్వేశాడు.  అలాంటి మనిషి ఆయన. 

సినిమాలో చూపించిన విధంగా సందీప్ ఉన్ని కృష్ణన్ చాలా ఫన్నీ అనుకోవచ్చా.?
ఫన్. పిచ్చ ఫన్. ఫ్రెండ్స్ అతన్ని శాండీ అని పిలిచేవారు.   అమ్మాయిలకు ఆయనంటే క్రష్. 

ఈ మూవీ చూసిన తర్వాత అందరూ భారత్ మాతాకీ జై. జోహార్ సందీప్ ఉన్ని కృష్ణన్ అంటున్నారు. ఈ నినాదాలు విన్న తర్వాత మీకు ఏమని అనిపించింది. మీరు అనుకున్నది రీచ్ అయినట్లు అనిపించిందా...? 
ఇంత టైం పట్టిందా అనిపించింది. సందీప్ ఉన్ని కృష్ణన్ మూవీని ఇంకా చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాలి. ఇంకెన్నో థియేటర్లలో చూపించాలి. ఇంకెంతో మంది చేత ఆ జోహార్ అనిపించాలి. ఈ సినిమా.. సినిమాగా ఆగిపోకూడదనే మా తపన. 

తర్వాత మీరు నటించే మూవీలు పాన్ ఇండియా లెవల్లో ఉండబోతున్నాయా ?
ఉంటాయి. హిట్–2 షూట్ చేశాం. దాని తర్వాత గూడచారి–2 ఉంటుంది. ఇవన్నీ  పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేద్దామని అనుకుంటున్నాం.

మీరు హాలీవుడ్ హీరోలా ఉంటారని..అన్నీ సినిమాలు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలే సెలక్ట్ చేసుకుంటారా ?
నాకు తెలిసినంత వరకు మేజర్ సినిమాలో ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ఉంది.  లవ్ స్టోరీ సినిమాలో చేసే అవకాశం ఉండేదో లేదో తెలియదు కానీ..మేజర్ సినిమాలో మాత్రం మంచి ప్రేమకథలో నటించాను. 

అడవి శేషు మూవీ వస్తుందంటే..యాక్షన్ మూవీ అయి ఉంటుంది. లేదా సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉంటుంది. లేదా ఆఫీసర్ పాత్రలో శేషు నటించి ఉంటారని మైండ్లో అనుకుంటాం. ఎందుకలా..?
నేనే మీ మైండ్లో జాగ్రత్తగా సెట్ చేశాను. ఫస్ట్ క్షణం అయిన తర్వాత థ్రిల్లర్ అని అన్నారు. గూడచారి అయిన తర్వాత యాక్షన్ అన్నారు.  మేజర్ తర్వాత ఆఫీసర్ అని అంటున్నారు. నేనే మార్చాను.  గూడచారి టైంలో ఎవరు కూడా ఆఫీసర్ అనే మాట వాడలేదు. దేశ భక్తి గురించి ఎవరు మాట్లాడలేదు. అందరూ థ్రిల్లర్ థ్రిల్లర్ అన్నారు. ఇప్పుడు థ్రిల్లర్ పక్కనపెట్టి..ఆఫీసర్, దేశభక్తి అంటున్నారు. నేను చేస్తున్న రకరకాల సినిమాల వల్ల మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతున్నారు.  నాకు ఫ్లోర్ డ్యాన్సులు వేయడం రాదు. ఇష్టం లేదు. మంచి మాస్ సాంగ్లో లుంగీ కట్టుకొని చేయాలని లేదు. అలాగని చెప్పి  ఓ గొప్ప రోల్ వస్తే నేను చేయకుండా ఉండలేను. నేను త్వరలో చేయబోతున్న సినిమాలో అప్పుడే  జైలు నుంచి బయటికొచ్చే మాస్ సీన్ ఉంది. 

అడవి శేషును మాస్ యాంగిల్లో లేదా ఇంకో డిఫ్రెంట్ కారెక్టర్లో చూడాలని అభిమానులు అనుకుంటున్నారు. 

మేజర్లో అలా సాంగ్స్ వేసుకుంటూ..ఇన్నోసెంట్గా స్కూల్లో తిరుగుతూ..నెంబర్ అడుగుతూ...అలా చేసే సరికి నాకు సరదాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. 40 నిమిషాల్లో  పేరెంట్స్తో ఉంటూ.. సరదాగా షికారుకు వెళ్తే బాగుంది. 

ముందు  స్లిమ్గా ఉన్నారు. తర్వాత నార్మల్గా అయిపోయారు. ఏదైనా గ్రాఫిక్స్లో సెట్ చేశారా..?
గ్రాఫిక్స్ రెండు చేశాం. వెయిట్ ఎంత తగ్గినా బుజాలు తగ్గవు కదా. ఎముకలు తగ్గవు కదా.. సో బుజాలను తగ్గించాల్సి వచ్చింది గ్రాఫిక్స్ లో. ఫేస్లో చెంపలను లేతగా చేసేందుకు గ్రాఫిక్స్ వాడాము. 

మేజర్ మూవీలో ముందు రాసుకున్న స్టోరీనే సినిమాగా తీశారా..? లేదా ఏవైనా చేంజ్ చేశారా..?
ముందు అనుకున్న స్టోరీ నాకు నచ్చలేదు. పేపర్పై బాగుంది..స్క్రీన్పై మరోలా వస్తుందని అర్థమైంది. సినిమా స్టార్టయిన సమయం నుంచి ఫినిష్ అయ్యే సరికి స్టోరీ మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఉదాహరణకు సెకండాఫ్లో స్నైపర్స్ ఓ సీన్  ఉంటుంది. ఒరిజినల్లో ఆ సీన్లో స్నైపర్ లేడు. నేనే వాడిని చంపేస్తాను. అయితే దాడి జరిగిన సమయంలో మేజర్ సందీప్ ఒక్కడే లేడు. అక్కడ ఎంతో మంది  తోపు ఆఫీసర్లు ఉంటారు. అది కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో అలా మార్చాం. అయితే ఆ సీన ఒరిజనల్గా రాయలేదు. చూస్తున్నప్పుడు అనిపించింది. అందుకే మళ్లీ రీ షూట్ చేశాం. 
మీ తర్వాత మూవీ హిట్–2 అని చెప్పారు. ఫస్ట్ పార్ట్ వేరే హీరో  చేశారు. సెకండ్ పార్ట్ మీరు చేస్తున్నారు. దానికి దీనికి తేడా ఏముంటుంది...?
డాక్టర్ శైలేష్ ఏం చెప్పారంటే..అదొక యూనివర్స్. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్. నేను వైజాగ్లో పోలీస్ ఆఫీసర్గా హిట్ –2లో చేస్తున్నా. నాకు హిట్–1లో విశ్వకు సంబంధం లేదు. హిట్ –1 కన్నా..హిట్ –2ను పెద్దగా తీయాలని భావిస్తున్నారు. 

గూడాచారి –2 సినిమా ఎలా ఉండబోతుంది...?
గూడాచారి–2 కోసం చాలా చాలా ఆసక్తితో ఉన్నా. అయితే ముందు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. మేజర్ సినిమా కోసం గత 25 రోజులుగా ప్రతీ రోజూ..3 గంటలు కూడా నిద్రపోలేదు. 

మేజర్ సినిమా కోసం విశ్రాంతి లేకుండా కష్టపడ్డారు. మరీ వచ్చిన రెస్పాన్స్తో మీరు సంతృప్తి చెందారా..?
మేజర్ సినిమాకు ప్రస్తుతం వచ్చిన రెస్పాన్స్తో సంతృప్తిగా లేను. ఇంకా రావాలి.  నా మైండ్ ఎలా పనిచేస్తది అంటే..మేజర్ సినిమాకు రూ. 500 కోట్లు వచ్చాయని చెప్తే..అవునా..ఇంకా ఆస్కార్ రాలేదు కదా అని అంటాను. అలా నా మైండ్ పనిచేస్తుంది.  నేను లైఫ్లో ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతా. నాకు డబ్బు వద్దు. పెద్ద పెద్దకార్లు వద్దు.  అంతస్తు వద్దు అనిపిస్తుంది. వాటిపై నాకు ఇంట్రస్ట్ లేదు. కానీ మేజర్ సందీప్ విషయంలో ఎంత చేస్తున్నా...అది సరిపోవడం లేదు. ఈ మాట చెప్తే కొందరు వీడేంట్రా ఇంత కటింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు. కానీ..నేను జెన్యూన్గా చెప్తున్నా.

ఈ మేజర్ సినిమాకే అలా ఫీల్ అవుతున్నారా.. లేదా అన్ని సినిమాలను అలాగే ఫీల్ అవుతారా..?
అంటే నేను డిఫాల్ట్గానే పని విషయంలో రాక్షసుడిని. అయితే ఈ సినిమాలో రాక్షసత్వంతోపాటు చిన్న ఎమోషన్. 

 హ్యాండ్ సమ్ అడవి శేషు పెళ్లెప్పుడని అంతా అడుగుతున్నారు. మరి మీరు పెళ్లికొడుకు ఎప్పుడవుతారు..?
(రెండు చేతులతో సిగ్గుపడుతూ..కళ్లు మూసుకుని..)మన ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్దలున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి వారున్నారు, అయితే ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ కదా..కాబట్టి ఫ్యామిలీలో మొదట ఎవరి పెళ్లి అవుతుంది. సో పెద్దలు చేసుకున్నాక  తర్వాత నేను చేసుకుంటా. నాకు సంప్రదాయాలంటే ఇష్టం. కాబట్టి..పద్దతి ప్రకారం అన్నయ్యలు చేసుకున్నాక నేను చేసుకుంటా. 

 అన్నయ్యలు చేసుకోకపోతే మీరు పెళ్లి చేసుకోరా.?
అంతేకదా..ముందు అన్నయ్యలు..తర్వాత నేను. పెళ్లి కాకపోతే బాధపడరు..పెళ్లయితేనే అమ్మాయిలు బాధపడతారు. అందుకే అమ్మాయిలను బాధపెట్టడం ఇష్టం లేక పెళ్లిచేసుకోవడం లేదు. 

మీరు యాక్షన్ , థ్రిల్లర్ మూవీలు చేస్తున్నారు. మరి లవ్ స్టోరీ ..ఫ్యామిలీ మూవీ ఛాన్స్ వస్తే చేస్తారా..?
నిన్న బాలకృష్ణగారి ఫ్యామిలీ మేజర్ సినిమాను చూశారు. బాలకృష్ణ గారు అర్జెంట్ మీటింగ్ వల్ల సినిమా చూడలేకపోయారు. అయితే అక్కడ పురందరేశ్వరీ గారితో పాటు చాలా మంది ఉన్నారు. సినిమా పూర్తయ్యాక.. ఓ చిన్న పాప కన్నీళ్లతో బయటకు వచ్చింది.  నన్ను చూడగానే మళ్లీ బిగ్గరగా ఏడుస్తూ హత్తుకుంది.  ఆ కన్నీళ్లు యాక్షన్ సినిమా నుంచి రావు..ఫ్యామిలీ సినిమా నుంచే వస్తాయి. మొత్తంగా మేజర్ సినిమా కూడా ఫ్యామిలీ మూవీనే. మేజర్ సందీప్ జీవితం..ఒక బ్యూటిఫుల్ లైఫ్.  ఆ జీవితాన్ని చూసి జనాలు ఫీలవుతున్నారు  అయన లేరా అని. అది ఒట్టి యాక్షన్ వల్ల రాదు , ఒట్టి  సాంగ్స్ వల్ల రాదు, లవ్ స్టోరీ చూడటం వల్లనే రాదు. ఇదంతా కూడిన ఒక జీవితం అయనది. నేను జెన్యూన్గా ఈ సినిమా ఒక లవ్ స్టోరీ అని నమ్ముతున్నా.  జెన్యూన్గా ఇది యాక్షన్ స్టోరీ అని నమ్ముతున్నా. జెన్యూన్గా ఇదోక ఫ్యామిలీ మూవీ అని నమ్ముతున్నా. 

మూవీ గురించి మహేష్​ బాబు ఏమన్నారు. ఆయన చూశారా..? 
రోజూ ఫోన్ చేస్తుంటారు. మూవీ హిట్ కావడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతబాగా ఆడుతోందా అని సర్ ప్రైజ్ అయ్యారు. అంటే గూడచారి, ఎవరు కన్నా..మేజర్ మూవీ డబుల్ హిట్ అని అనుకున్నాం. కానీ..ఐదింతలు ఉంటుందని అనుకోలేదు. 

మేజర్ మూవీకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమిటి..?
రోజూ రకరకాలుగా కాంప్లిమెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొందరు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక..గుడ్ లక్కు బదులు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ముఖ్యంగా సందీప్ ఉన్నికృష్ణన్ అమ్మగారు నాకు మెసేజ్ పెట్టారు. ఐదోసారి సినిమా చూస్తున్నా అని. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నా.

సందీప్ ఉన్ని కృష్ణన్ అమ్మనాన్నలతో మీ రిలేషన్ ఎలా ఉంది..?
చాలా బాగుంది. సినిమాను ఫస్ట్ టైం చూసే సమయంలో సందీప్ గారి అమ్మగారు ఏ చీర కట్టుకొచ్చారంటే 23 ఏళ్ల క్రితం సందీప్ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి  కట్టుకున్న చీర..మేజర్ సినిమా ప్రీమియర్కు కట్టుకున్నారు.

మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మీ మీద అంత ఎఫెక్షన్ ఎందుకు వచ్చింది..?
 నా తపన. పబ్లిక్గా అంకుల్ చెప్పారు. మేజర్ సందీప్ కథను ఇంత బాగా చూపించాలి అని తపన. ఆ తపనే వారికి నామీద ఎఫెక్షన్ కలగడానికి కారణం అనుకుంటున్నా.

మేజర్ సందీప్ జీవితాన్ని సినిమాగా తీస్తామని..మీకంటే ముందు ఎంతో మంది వారిని అప్రోచ్ అయ్యారు. కానీ వారు ఒప్పుకోలేదు. కానీ మీరు అడగ్గానే ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాకుండా మీకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మీరు ఎలా కన్విన్స్ చేశారు. 
నా పాషన్ను వాళ్లు నమ్మారు. నా సిన్సియారిటీని నమ్మారు. మహేష్​ బాబు సార్ కూడా కథ వినకుండానే ఓకే చెప్పారు.  మనిషిలో.. అతను చేయాలనుకుంటున్న పనిలో వాల్యూ కనిపించిందని నమ్మారు. అందుకే ఓకే చెప్పారు. 

ఓవరాల్గా సినిమా గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది..?
ఇంత జర్నీ అయిందా అని ఫీలింగ్. (నవ్వుతూ) 

సోల్జర్స్కి మంచి ఫ్లాట్ ఫాం ఇస్తా అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి..?
ఆయన లాగా ఆలోచించిన వాళ్లు దేశంలో ఖచ్చితంగా చాలా మంది ఉంటారు. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని..వాళ్ల నమ్మకాన్ని మన సొసైటీ బ్రేక్ చేస్తుంది. వాళ్లు ఎంతో చేయాలనుకుంటారు. కానీ అపనమ్మకాల వల్ల. సిస్టంలో లోపాల వల్ల. పేరెంట్స్ ఎందుకులేరా అని అనడం వల్లనోజజ వాళ్లు చేయాలనుకున్నది కరెక్ట్ కాదేమో అని వాళ్లే తగ్గుతారు. సందీప్ సార్ ఒక గొప్ప మనిషి కాబట్టి తగ్గలేదు. వాళ్లు బయటిపరిస్థితుల వల్ల తగ్గిపోకూడదని ఫ్లాట్ ఫాం ఇవ్వాలని అనుకుంటున్నా. 

ఓటిటిలో ఎప్పుడు వస్తుంది మేజర్ మూవీ..?
ఓటిటిలో రెండు మూడు నెలల తర్వాతే రిలీజ్ చేస్తాం. వంద రోజులు ఆడాకే ఓటిటిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. 

 ఇప్పటి వరకు సినిమాను చూడని వాళ్లకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు.?
మేజర్ నా లైఫ్లో బెస్ట్ ఫిల్మ్. మహేష్​ బాబు సార్ ఆయన సినిమా హిట్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతకన్నా రెండింతలు సంతోషపడుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మేము అనుకున్నదాని కంటే పదింతలు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి అనుకుంటే మేజర్ సినిమా చూడండి.