G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘G2' మూవీ..ఫస్ట్ పార్ట్ కంటే ఏకంగా16 రెట్లు అధికం!

G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘G2' మూవీ..ఫస్ట్ పార్ట్ కంటే ఏకంగా16 రెట్లు అధికం!

టాలెంటెడ్ హీరో అడవి శేష్(Adavi shesh) కెరీర్ లో మెమరబుల్ మూవీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు గూఢచారి(Goodachari). 2018లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ భారీ విజయాన్ని సాధించింది. శశి కిరణ్ తిక్కా(Shashi kiran tikka) తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కథ, కథనం, ప్రెజెంటేషన్ ఇలా ప్రతీ విషయంలో టాప్ నాచ్ గా ఉంటుంది ఈ మూవీ. ఇక సినిమాలో అడవి శేష్ నటన అద్భుతం అనే చెప్పాలి. గూఢచారి సినిమా తరువాత థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు అడవి శేష్. అంతేకాదు ఆయన సినిమాలకు సెపరేట్ మార్కెట్ కూడా ఏర్పడింది. 

Also Read:-నేడు థియేటర్లలో రిలీజైన సినిమాలివే..ఆడియన్స్ అంచనాలు మించేలా!

ఇక గూఢచారి సినిమాకి సీక్వెల్ గా వస్తోన్న G2 పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో లావీష్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కనుందని సమాచారం బయటికి వచ్చింది. గ్రాండ్ స్కేల్‍లో ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకురానున్నారు.

ఫస్ట్ పార్ట్ గూఢచారి సినిమా రూ.6కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కి..సుమారు రూ.25కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. తక్కువ బడ్జెట్ అయినా గూఢచారి చిత్రం చాలా క్వాలిటీతో వచ్చింది. ఈ సినిమా నరేషన్, స్టోరీ, స్క్రీన్‍ప్లే అదిరిపోయాయి. దీంతో భారీ హిట్ అవటంతో గూఢచారి ఫ్రాంచైజీకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో లేటెస్ట్ G2కి దాదాపు 16 రెట్ల అధిక బడ్జెట్‍తో రానుంది. ఇక అంచనాలు ఏ లెవల్లో ఉండనున్నాయి ఊహించుకోండి. 

ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మిని సెలెక్ట్ చేశారు మేకర్స్.ఇమ్రాన్ హస్మి ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఓజీలో విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడే అదే క్రేజ్ ను G2 సినిమా కోసం వాడేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్స్‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.