నాగార్జున మేనకోడలుతో అడవి శేష్​పెళ్లి!

నాగార్జున మేనకోడలుతో అడవి శేష్​పెళ్లి!

టాలీవుడ్​లో మరో ప్రేమజంట ఒక్కటి కాబోతోంది. పవన్​ కళ్యాణ్​ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో నాగార్జున మేనకోడలు సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నటనకు గుడ్​బై చెప్పిన సుప్రియ నిర్మాతగా రాణిస్తోంది. తన సినిమాలతోనే కాకుండా వరుస రూమర్లతో వార్తల్లో నిలుస్తోంది. 

టాలీవుడ్​ ట్యాలెంటడ్​ హీరో అడవిశేష్​తో డేటింగ్​లో ఉందంటూ 2019 నుంచే ఆమెపై రూమర్లు వినిపిస్తున్నాయి. అక్కినేని వారి ఇంట జరిగే ఫంక్షన్లలో శేష్​ కనిపించడం, ఇద్దరూ కలిసి మీడియా కంట పడటంతో ఆ ఫొటోలు వైరల్​గా మారాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

శేష్ ఫ్యామిలీ ఎట్టకేలకు గ్నీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్​ చేశారని తెలుస్తోంది. నాగార్జున దగ్గరుండి ఈ వేడుకను జరిపించనున్నాడట. జూన్​ 16న వీరి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నట్టు సమాచారం.