ప్రేమించి మోసం చేశావు.. ఇడిచిపెట్టను.. వైరల్ అవుతున్న అడివి శేష్, మృణాల్ ట్వీట్స్..

ప్రేమించి మోసం చేశావు.. ఇడిచిపెట్టను.. వైరల్ అవుతున్న అడివి శేష్, మృణాల్ ట్వీట్స్..

అడివి శేష్‌‌ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ ‘డెకాయిట్’. షానీల్‌‌ డియో దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌‌ శరవేగంగా జరుగుతోంది. ఇవాళ Dec 17న అడివి శేష్‌‌ బర్త్డే స్పెషల్గా డెకాయిట్ నుండి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుండి రెండు డిఫరెంట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.

డెకాయిట్ సినిమాలో నటించనున్న హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చింది. ముందుగా ఇందులో హీరోయిన్ శృతి హాసన్ ని ఎంపిక చేసిన టీమ్.. అప్పట్లో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.కానీ, ఇపుడు రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం సీతరామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.తెర వెనుక ఏమైందో గానీ, హీరోయిన్ డెకాయిట్ హీరోయిన్ మాత్రం మారిందని సినీ వర్గాల సమాచారం. అయితే, హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

ALSO READ | అల్లు అర్జున్ బెయిల్ రద్దు కాబోతున్నదా.. హైకోర్టులో పోలీసుల అప్పీల్..?

అయితే, ఇందులో మృణాల్ హీరోయిన్గా కన్ఫమ్ అయిందని చెప్పడానికి అడవిశేష్ చేసిన ట్వీట్ బలాన్ని చేకూరుస్తోంది. డెకాయిట్ మూవీ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇస్తూ "అవును.. ప్రేమించావు. కానీ.. మోసం చేశావు. ఇడిచిపెట్టను తేల్చాల్సిందే" అని హీరోయిన్ మృణాల్  క్యారెక్టర్‌ను ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు. దానికి మృణాల్ ఠాకూర్ కూడా రిప్లై ఇస్తూ "అవును వదిలేశాను. కానీ.. మనస్ఫూర్తిగా ప్రేమించాను" అంటూ అడివి శేష్ కి హ్యాపీ బర్త్‌డే విషెష్ తెలిపింది.

ప్రస్తుతం మృణాల్ తెలుగుతో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోస్‌‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.