- వకాలత్ దాఖలు చేసిన మంత్రి సురేఖ తరఫు న్యాయవాది
- ఈ నెల 30వ తేదీకి విచారణ వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్, వెలుగు : మంత్రి కొండా సురేఖపై సినీహీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం కేసుపై నాంపల్లిలోని మనోరంజన్ స్పెషల్ కోర్టు బుధవారం విచారణ జరిపింది. సురేఖ తరుఫున న్యాయవాది గుర్మీత్ సింగ్ వకాలత్ దాఖలు చేశారు. కొండా సురేఖకు ఈ నెల 10న కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని కొండా సురేఖ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు.