![Delhi Liquor scam : బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్](https://static.v6velugu.com/uploads/2023/01/Liquor-scam-case_kVoAPqFtaz.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరికి కేసుకు సంబంధించి ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితులతో పాటు ఈడీ తరఫు వాదనలు విన్న అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఫిబ్రవరి 9 సాయంత్రం 4 గంటలకు తీర్పు వెలువడించనున్నట్లు కోర్టు ప్రకటించింది. కేసు విచారణలో భాగంగా నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వాటిని పరిశీలించిన అనంతరం న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, బినాయ్ బాబు,శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో వారు బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నిందితులంతా తీహార్ జైల్లో ఉన్నారు.