ధర్మారం, వెలుగు: మంత్రి కొప్పుల ఈశ్వర్ 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, 9 ఏండ్లుగా మంత్రిగా ఉండి దళితులకు చేసిందేమీ లేదని కరీంనగర్ జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఉదయం ధర్మారం చౌరస్తాలో రాస్తారోకో చేయడానికి వెళ్తున్న అడ్లూరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సాయంత్రం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 9 ఏండ్లుగా ఏ ఒక్క పనినీ పూర్తి చేయని మంత్రి కొప్పుల, ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.