గొల్లపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల– బొంకూర్ గ్రామాల శివారులోని వేంకటేశ్వర స్వామిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా జరుగుతుండగా సోమవారం ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు.
పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, నిర్వాహకులు విప్ అడ్లూరికి, వంశీకృష్ణకు శాలువా కప్పి స్వామి ఫొటో తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, లైబ్రరీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రావు, లీడర్లు భీమా సంతోష్, రాజేశ్వర్ రావు, రాంగోపాల్ రెడ్డి, లింగారెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు