జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బర్త్ డే వేడుకలు

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బర్త్ డే వేడుకలు

జగిత్యాల/గొల్లపల్లి/ధర్మారం, వెలుగు: ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బర్త్ డే వేడుకలను జగిత్యాల జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో  యువజన కాంగ్రెస్ ఎస్సీ సెల్, బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కాంగ్రెస్ సీనియర్‌‌ ‌‌  నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై కేక్‌‌  కట్‌‌  చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో లీడర్లు పూజలు చేసి, అన్నదానం కార్యక్రమాలు చేశారు. ధర్మపురిలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంగనభట్ల దినేశ్‌‌  శర్మ, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, ఏఎంసీ చైర్మన్ లావణ్య లక్ష్మణ్, వైస్ చైర్మన్ నర్సింహులు, బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుంట సుధాకర్, లక్ష్మీనర్సింహా స్వామి టెంపుల్ చైర్మన్ జక్కు రవీందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్‌‌  పాల్గొన్నారు. 

గొల్లపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, ధర్మారంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, వెల్గటూర్, ఎండపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, పెగడపల్లిలో బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ధర్మారం అంబేద్కర్‌‌ ‌‌  చౌరస్తాలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్‌‌ , మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి కేక్‌‌  కట్‌‌  చేసి పంపిణీ చేశారు. లీడర్లు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధన్, రాజేశం గౌడ్ పాల్గొన్నారు.