గొల్లపల్లి, వెలుగు: ఆయకట్టు చివరిదాకా ఎస్‌ఆర్ఎస్‌పీ నీరందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండలానికి సాగునీరు అందించే డీ 64 కాలువను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి తలాపున గోదావరి ఉన్న గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందలేదన్నారు.
కాలువలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడంతో భారీ వర్షాలకు తెగిపోయాయన్నారు. యాసంగిలో ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరందించేలా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, లీడర్లు సురేందర్ రెడ్డి, మహేశ్, విజయ్, దిలీప్, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.