ధర్మారం, వెలుగు: రానున్న రోజుల్లో ధర్మారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ధర్మారం మండల పరిషత్ఆఫీసులో ఎంపీపీ కరుణశ్రీ అధ్యక్షతన జరిగిన జనరల్‌బాడీ మీటింగ్‌లో ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మారం మండలం రాజకీయంగా తనకు జన్మనిచ్చిందని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో గతంలో జడ్పీటీసీగా, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేశానని గుర్తుచేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో రాబోయే రోజుల్లో మండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం మండలంలోని పలు సమస్యలను ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.