
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ భవనం కూలడంతో ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న అడ్మినిస్ట్రేషన్ భవనం కులిపోయింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 27) సాయంత్రం జరిగింది ఈ ఘటన. కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ కూలడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై బాల్కనీ కూలడంతో ప్రమాదం జరిగింది. శిథిలాల కింద నుంచి సిబ్బంది కార్మికుడిని కాపాడారు. కూలిన శిథిలాలను తొలగించి కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ చేశారు.
భవనం కూలిందనే సమాచారంతో యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.