దేశవ్యాప్తంగా నెలకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-–2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో అడ్మిషన్స్‌కు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 - 26 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మిలిటరీ స్కూళ్లలో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అర్హులైన బాలబాలికలు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అర్హతలు: 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. వయసు 10 నుంచి 12 ఏండ్ల మధ్య ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. వయసు 13 నుంచి 15 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ఓఎమ్మార్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.