హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల( జయశంకర్ యూనివర్సిటీ అనుబంధం) లో ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ల కోసం అప్లికేషన్లు ఈ నెల 12 నుంచి అందుబాటులో ఉంటాయని గురుకులాల సెక్రటరీ సైదులు వెల్లడించారు. ఈఏపీసెట్-– 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినీలు https://mjptbcwreis.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వనపర్తి, కరీంనగర్ లో ఉన్న మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థినీలు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థినీ తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వారి వార్షికాదాయం రూ.2 లక్షలు- మించని విద్యార్థినీలు మాత్రమే అర్హులని వెల్లడించారు.