
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)- మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మ్యాట్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్ట్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తదితర విధానాల్లో నిర్వహిస్తారు.
అర్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్ట్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష ఉంటుంది..
పేపర్ బేస్డ్ టెస్టుకు ఫిబ్రవరి 20, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పేపర్ బేస్డ్ పరీక్ష ఫిబ్రవరి 25, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మార్చి 10న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.mat.aima.in వెబ్సైట్లో సంప్రదించాలి.