రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్
న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్.. స్కూల్స్, కాలేజీల్లోని ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది. సంస్కృత విద్యా అభివృద్ధిలో భాగంగా వీటిని అందిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంస్కృతం, పాలి, ప్రాకృత భాషలను మెయిన్ లేదా ఆప్షనల్ సబ్జెక్టుగా చదువుతున్న తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థులు అర్హులు. దరఖాస్తు విధానం: సంస్కృతం, పాలి, ప్రాకృత భాషలను బోధిస్తున్న ఇన్స్టిట్యూట్స్ ముందుగా ఆన్లైన్లో తమ కాలేజ్ లేదా స్కూల్ పేరును నమోదు చేసుకోవాలి. అవి యాక్టివేట్ అయిన తర్వాత స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరితేది: 2019 అక్టోబర్ 20 (ఇన్స్టిట్యూట్స్), అక్టోబర్ 30 (విద్యార్థులు); వివరాలకు: www.scholarship.rsks.in, www.sanskrit.nic.in
నిమ్హాన్స్లో పీహెచ్డీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్–బెంగళూరు) 2019–20 విద్యాసంవత్సరానికి బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ న్యూరోసైన్సెస్, మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్, న్యూరాలజీ, న్యూరోఇమేజింగ్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తదితర విభాగాల్లో పీహెచ్డీ, పీడీఎఫ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 51 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లు: పీహెచ్‌డీ–10, సూపర్ స్పెషాలిటీ–13, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్–9, ఎండీ–19; అర్హత: ఆయా సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్, పీజీ, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీలకు రూ.1000. పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు. సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 సెప్టెంబర్ 16; పరీక్షతేది: 2019 అక్టోబర్ 20; వివరాలకు: www.nimhans.ac.in
అగ్రి–బిజినెస్ మేనేజ్‌మెంట్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఏఏఆర్‌ఎం) 2020–22 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి–బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సెలెక్షన్ ప్రాసెస్: క్యాట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 డిసెంబర్ 31; వివరాలకు: www.manage.gov.in
ఫైర్ సేఫ్టీలో డిప్లొమా
హైదరాబాద్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ (ఎన్సీఎఫ్ఎస్ఈ) వివిధ ఫైర్ సేఫ్టీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులు: డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఫైర్ టెక్నాలజీ, ఇండస్ర్టియల్ సేఫ్టీ ఆపరేషన్, డిప్లొమా ఇన్ ఇండస్ర్టియల్ సేఫ్టీ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్‌మన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ ఆఫీసర్ అండ్ సబ్ ఆఫీసర్ తదితరాలు. అర్హత: కోర్సును బట్టి ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. చివరితేది: 2019 సెప్టెంబర్ 9; కాంటాక్ట్ నంబర్: 9701496748; వివరాలకు: www.ncttindia.com
అగ్రి–బిజినెస్ మేనేజ్‌మెంట్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఏఏఆర్‌ఎం) 2020–22 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి–బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సెలెక్షన్ ప్రాసెస్: క్యాట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 డిసెంబర్ 31; వివరాలకు: www.manage.gov.in
ఐజీఎన్‌సీఏలో సర్టిఫికెట్ కోర్సులు
ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్(ఐజీఎన్‌సీఏ–న్యూఢిల్లీ) 2019–20 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కోర్సుల కాలవ్యవధి మూడు నెలలు. ఆఫ్‌లైన్‌లో ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. కోర్సులు–సీట్లు: డాక్యుమెంటరీ అండ్ ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్‌మేకింగ్–25, స్ర్కీన్ రైటింగ్–25, ఫోక్లోర్ అండ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్–25, ఓపెన్ యాక్సెస్ ఫర్ లైబ్రేరియన్స్–25, రీసెర్చ్ మెథడాలజీ–25; అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 సెప్టెంబర్ 9; వివరాలకు: www.ignca.gov.in
ఎన్ఐబీఎంలో పీజీడీఎం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐబీఎం–పుణె) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. CAT 2018 / XAT (2019) / CMAT (2019) లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. ఫీజు: రూ.1500; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్ చేసి ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరితేది: 2020 మార్చి 20; వివరాలకు: www.nibmindia.org
ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో
నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజినల్ సెంటర్, చెన్నైలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్టివిటీ 2019–20 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాలవ్యవధి ఒక సంవత్సరం. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, గేట్ స్కోర్, ఇంటర్వ్యూ; చివరితేది: 2019 సెప్టెంబర్ 5; వివరాలకు: www.npcindia.gov.in
ఎన్‌పీటీఐలో పీజీడీఎం ప్రోగ్రామ్
మినిస్ర్టీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: ఎలక్ర్టికల్/పవర్/ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్; చివరితేది: 2019 అక్టోబర్ 4; వివరాలకు: www.npti.gov.in
ఎయిమ్స్, జోద్‌పూర్
రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 2019–20 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్లు: 15 (మెడికల్–7, నాన్‌మెడికల్–3, స్పాన్సర్డ్–5); అర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్/ ఆయుష్/బీఈ/ బీటెక్/ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.800; సెలెక్షన్ ప్రాసెస్: రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 అక్టోబర్ 1; పరీక్షతేది: 2019 నవంబర్ 7; వివరాలకు: www.aiimsjodhpur.edu.in