డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) కోర్సులో అడ్మిషన్స్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. డిప్లొమా కేటగిరీలో హార్టిసెట్ ఆధారంగా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ కళాశాలలకు 61 సీట్లు, అనుబంధ కళాశాలలకు 40 సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఏపీ హార్టిసెట్-2024, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది.
దరఖాస్తులు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, డా.వై.ఎస్.ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామాకు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా జూన్ 15 వరకు పంపించాలి. పరీక్ష జులై 26న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.drysrhu.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.