గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూళ్ల‌లో అడ్మిషన్లు

ఫైన్ ఆర్ట్స్ అభివృద్ధికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ ల్కాజ్‌‌గి రి ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌‌లో ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్‌‌ ఇన్‌‌స్టి ట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌ డ బ్ల్ యూఆర్ఈఐఎస్‌ ) ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా2019-20 సంవత్సరానికి ఆరో తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది.

విభాగాలు-ఖాళీలు:

మ్యూజిక్‌‌-40, డ్యాన్స్‌-20, థియేటర్ ఆర్స్‌ట్-10, పెయింటిం గ్ అండ్ డ్రాయింగ్‌-10.

అర్హత :

2018–19లో సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి చదివిన తెలంగాణ కు చెందిన విద్యార్థులు అర్హులు.

వయసు:

2019 ఆగస్టు 31 నాటికి 12 ఏళ్లకు మించకూడదు.

ఆదాయ పరిమితి:

తల్లిదండ్రుల వార్ షిక ఆదాయం గ్రామాల్లో లక్షా 50 వేలు, పట్టణాల్లో రూ.2 లక్షలు దాటకూడదు.

సెలెక్షన్ ప్రాసెస్:

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా

పరీక్షా విధానం:

రాత పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఐదో తరగతిలోని ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, ఎన్వి రాన్‌‌మెంటల్ సబ్జెక్టు ల నుంచి 10 చొప్పున ప్రశ్నలిస్తారు. అనంతరం ఫైన్ ఆర్ట్స్​లో 50 మార్కులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

చివరి తేది: 2019 మే 21

పరీక్ష తేది: 2019 మే 26

వెబ్‌‌సైట్: www.tswreis.in