
హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)... రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో 2024-–25 విద్యాసంవత్సరం ప్రవేశ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సీవోఈ (సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్) కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులు; ఇంటర్ కళాశాలల్లో మొదటి ఏడాది అడ్మిషన్స్ ఉంటాయి.
అర్హత: తరగతిని అనుసరించి 4, 5, 6, 7, 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు. ఏమైనా సందేహాలు ఉంటే 040 23437909కు ఫోన్ చేయవచ్చు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.cet.cgg.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి.