![తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్](https://static.v6velugu.com/uploads/2022/02/Admissions-in-Telangana-Model-Schools_HtJwo8dsFz.jpg)
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో 2022 - 2023 విద్యాసంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతిలో అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ కోరుతోంది; సెలెక్షన్ ప్రాసెస్: ఎంట్రన్స్ టెస్టులో సాధించిన మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు; దరఖాస్తులు: ఆన్‌లైన్; చివరి తేది: 10 మార్చి; ఎగ్జామ్: ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 16. ఆరో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 17న నిర్వహిస్తారు; వెబ్సైట్: www.telanganams.cgg.gov.in
ఎంఎన్‌ఎన్‌ఐటీలో ఎంబీఏ
అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఎన్‌ఐటీ) ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది; అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, వాలిడ్ క్యాట్ స్కోర్ ఉండాలి; సెలెక్షన్ ప్రాసెస్: క్యాట్ పర్సంటైల్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు; దరఖాస్తులు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్; చివరి తేది: 20 మార్చి; గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీలు: 2022, ఏప్రిల్ 23, 24; వెబ్సైట్: www.academics.mnnit.ac.in
నిట్, తిరుచిరాపల్లిలో..
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది; కోర్సు డ్యురేషన్: రెండేళ్లు; అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: క్యాట్ 2021 స్కోర్, ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ, అకడమిక్ ప్రతిభ, పని అనుభవం ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్‌లైన్; చివరి తేది: 28 ఫిబ్రవరి; వెబ్సైట్: www.admission.nitt.edu
ఎన్ఐపీహెచ్‌టీఆర్‌లో..
ముంబయిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐపీహెచ్‌టీఆర్) 2022-23 విద్యాసంవత్సరానికి వివిధ రెగ్యులర్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది; దరఖాస్తులు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్; చివరి తేది: 31 మార్చి; వెబ్సైట్: fwtrc.gov.in