గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024–-25 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 40 సంవత్సరాలు ఉండాలి.
సెలెక్షన్: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీలకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చెల్లించాలి.
వివరాలకు www.angrau.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ALSO READ : Good News : యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు