ప్రభుత్వంచే గుర్తించబడిన ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో 2024–25 విద్యా సంవత్సరానికి జర్నలిజంలో డిప్లొమా, పీజీ, సర్టిఫికేట్ కోర్సులకు అడ్మిషన్స్ కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు: డిగ్రీ అర్హతతో పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం ఏడాది, డిప్లొమా ఇన్ జర్నలిజం ఆరు నెలలు, డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం ఆరు నెలలు, సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (పదో తరగతి అర్హత) మూడు నెలల డ్యురేషన్తో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫారంలు సెప్టెంబర్ 2 వరకు తీసుకోవచ్చు, సెప్టెంబర్ 6 వరకు అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కోర్సులు రెగ్యులర్ లేదా డిస్టెన్స్లో పొందవచ్చు. తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో క్లాస్లు ఉంటాయి. పూర్తి వివరాల కోసం 9848512767, 7286013388 లేదా 040–79610940 ల్యాండ్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సమాచారం కోసం www.apcj.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.