తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ(ఎంజేపీటీబీబీసీడబ్ల్యూ), ఎస్సీ (టీఎస్‌డబ్ల్యూ), ఎస్టీ (టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న జరగనుంది.
కోర్సులు: బీఎస్సీ, బీకాం, బీఏ, బీహెచ్‌ఎంసీటీ, బీబీఏ, బీఎఫ్‌టీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 2023–-24 విద్యా సంవత్సరం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
సెలెక్షన్: ప్రవేశ పరీక్ష మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఏప్రిల్ 28న నిర్వహిస్తారు. వివరాలకు www.tswreis.ac.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.