జనగామ, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చెప్పారు. ప్రచారంలో భాగంగా మంగళవారం జనగామలో నిర్వహించిన రోడ్‌షోలో క్యాండిడేట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. హామీలను అమలు చేయని కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. క్యాండిడేట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాయ్తినని, రంగప్ప చెరువును టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు.