ఇక బొమ్మ అద్దిరిపోద్ది ..ఫొటోషాప్ లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్..

ఇక బొమ్మ అద్దిరిపోద్ది ..ఫొటోషాప్ లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్..

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం అడోబ్ తన ఫేమస్ సాఫ్ట్ వేర్ ఫొటోషాప్ లో ఓ వినూత్న ఏఐ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. జెనరేటివ్ ఎక్స్ పాండ్ అనే ఏఐ ఫీచర్ తో ఇకపై ఇమేజ్ లను ఎంతంటే అంత పెద్దగా మార్చుకోవచ్చు. జనరేటివ్ ఎక్స్ పాండ్ ను ఉపయోగించి ఇమేజ్లను కావాల్సిన సైజ్ లోకి మార్చుకోవచ్చు. ఇమేజ్ ఎక్స్ పాండ్ చేసినప్పుడు మధ్య ఏర్పడే ఖాళీలను ఈ ఫీచర్ విజయవంతం మ్యానేజ్ చేస్తుంది. 

జనరేటివ్ ఎక్స్ పాండ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇమేజ్ లో కొన్ని భాగాలు కత్తిరించబడి ఉన్నా.. అవసరమైన సర్దుబాట్లకోసం జనరేటివ్ ఎక్స్ పాండ్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు మనకు కావాల్సిన నిర్దిష్టమైన సైజులలోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ తో సులభతరం అవుతుంది.వినియోగదారులు సృజనాత్మక దృష్టికి అనుగుణంగా ఇమేజ్ ని మార్చుకోవచ్చు. 

జనరేటివ్ ఎక్స్ పాండ్ ను వినియోగించడం కూడా చాలా ఈజీ.. టెక్ట్స్ ప్రాంప్ట్ ఉపయోగించి లేదా ఉపయోగించకుండా కూడా కంటెంట్ ని జోడించవచ్చు. టెక్ట్స్ ప్రాంప్ట్ లేకుండా కంటెంట్ ఇచ్చినట్లయితే అది కాన్వాస్ మొత్తానికి మనం ఇచ్చిన ఆదేశాలను అప్లయ్ చేస్తుంది. అదే టెక్ట్స్ ప్రాంప్ట్ వినియోగించినట్లయితే మనకు ఎంచుకున్న వాటికి మాత్రమే అప్లయ్ అవుతుంది. 

అంతేకాదు అడోబ్ 100 కు పైగా భాషలకు  టెక్ట్స్ ప్రాంప్ట్ లో సపోర్ట్ చేసే విధంగా ఫైర్ ఫ్లై ఆధారిత ఫీచర్ల సామర్థ్యాన్ని విస్తరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు వారి వారి భాషల్లో టెక్ట్స్ ఫ్రాంప్ట్ లను వినియోగించుకోవచ్చు.