
ఐఫోన్లో ఫొటో షాప్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది కంపెనీ. ఆండ్రాయిడ్‌లో ఈ అప్లికేషన్ ఏడాది చివర్లో తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఐఓఎస్, ఆండ్రాయిడ్ కోసం ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్ యాప్ అందుబాటులో ఉంది. కానీ, ఇప్పుడు రాబోయేది న్యూ జెనరేషన్ ఇమేజ్, డిజైన్లు చేయొచ్చు. దీంతోపాటు మరిన్ని ఫీచర్లను యాక్సెస్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది. కొత్త మొబైల్ యాప్ లేయరింగ్, మాస్కింగ్ వంటి టూల్స్‌తో సహా ఫొటోషాప్ ఐకానిక్ ఇమేజ్ ఎడిటింగ్, డిజైన్ కెపాసిటీతో వస్తుంది.
దాంతోపాటు ఇది అడోబ్ ఫైర్–ఫ్లై బేస్డ్ జనరేటివ్ ఫిల్, జనరేటివ్ ఎక్స్పాండ్ను కలిగి ఉంది. అలాగే రిమూవ్ టూల్, క్లోన్ స్టాంప్, ఆబ్జెక్ట్ సెలక్ట్, కంటెంట్ అవేర్ ఫిల్ వంటివి కూడా ఉంటాయి. అయితే వీటిలో కొన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. మరికొన్నింటిని మాత్రం కొనాల్సి ఉంటుంది. ఫొటోషాప్ ప్రీమియం అప్‌గ్రేడ్ చేయాలంటే నెలకు 733.96 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫొటోషాప్, లైట్ రూమ్ బండిల్ ప్యాక్ కోసం నెలకు 798.10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లు డెస్క్ టాప్, వెబ్, ఐఫోన్, ఐప్యాడ్లలో ఫొటోషాప్ యాక్సెస్‌ను అందిస్తాయి.