దత్తత పాపను అందించిన కలెక్టర్

కరీంనగర్ టౌన్,వెలుగు :  మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి   హైదరాబాద్ కు  చెందిన  దంపతులకు దత్తత పాపను గురువారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు.  దత్తత తీసుకున్న దంపతులు చిన్నారులకు  మంచి విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.  అడాప్షన్ రెగ్యులేషన్స్- చట్టం 2022 ప్రకారం దత్తత  ఇచ్చామన్నారు. గత జనవరిలో  చెన్నయ్​కి చెందిన దంపతులకు

 దత్తత ఇచ్చిన పాప ఉత్తర్వుల కాపీని సదరు పేరెంట్స్ కు  ఇచ్చారు.  అనంతరం ఈనెల 9 నుంచి 23వరకు సిటీలో మహిళాభివృద్ది,శిశు సంక్షేమ శాఖ  ఆద్వర్యంలో నిర్వహించిన పోషణ్​ పక్షత్సవాల్లో   ఫస్ట్ ప్లేస్  లో  నిలిచిన కరీంనగర్  ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను కలెక్టర్  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యుఓ ఎం.సరస్వతి, శిశుగృహ మేనేజర్‌ తేజస్వి, తదితరులు పాల్గొన్నారు.