
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) రిపోర్ట్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఏకంగా రూ.2243 కోట్ల విరాళాలు దక్కించుకోగా, రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి రూ.281.48 కోట్లు దక్కాయి. జాతీయ పార్టీలు 2023–24లో రూ.20వేలకు పైగా మొత్తంతో తమకు అందిన విరాళాల లెక్కలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అత్యధికంగా బీజేపీకి రూ.723.67కోట్లు, కాంగ్రెస్ కు రూ.156.40కోట్లు విరాళంగా అందించింది.
- జాతీయ పార్టీలకు 2023–24లో మొత్తం 12,547 విరాళాలు అందాయి. ఈ మొత్తం విరాళాల విలువ రూ.2544.28 కోట్లు. 2022–23తో పోలిస్తే ఇది 199శాతం అధికం.
- రూ.20వేలకు పైగా మొత్తంలో ఉన్న విరాళాలు 2023–24లో భారతీయ జనతా పార్టీకి మొత్తం 8,358(వాటి విలువ రూ.2,243 కోట్లు) వచ్చాయి. 2022–23లో పార్టీకి వచ్చిన రూ.719.85 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 211.72 శాతం అధికం.
- 2023–24లో మొత్తం విరాళాల విలువలో 88శాతం భారతీయ జనతా పార్టీకి దక్కింది.
- 1994 విరాళాల రూపంలో రూ.281.48 కోట్లు కాంగ్రెస్ పార్టీకి అందాయి. ఈ విలువ 2022–23లో వచ్చిన మొత్తంతో పోలిస్తే 252.18 శాతం అధికం.