
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ) వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల కోసం ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)–2023 నోటిఫికేషన్ జారీ చేసింది.
కోర్సులు :
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(ఇంటీరియర్ డిజైన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ) ఇన్ పెయింటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్, అప్లయిడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు :
ఇంటర్మీడియెట్ (ఎంపీసీ/ ఎంఈసీ/ బైపీసీ/ఎంబైపీసీ/ సీఈసీ/ హెచ్‌ఈసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఎంట్రెన్స్ టెస్ట్ ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్ :
బీఎఫ్‌ఏ, బీడిజైన్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం 120 నిమిషాలు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది.
దరఖాస్తులు :
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ysrafu.ac.in వెబ్సైట్లో చూడాలి.